Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ .. ఎవరీ సోఫియా,వ్యోమికా?

Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ .. ఎవరీ సోఫియా,వ్యోమికా?
X

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయ వంతంగా ముగింది. ఈమెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ బ్రీఫింగ్ ఇచ్చింది. ఈ ఆపరేష నకు నాయకత్వం వహించిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీలు ఉగ్ర మూకల్ని ఎలా మట్టుబెట్టామన్నది వెల్లడించా రు. దాడి దృశ్యాలకు సంబంధించిన వీడియో ల్ని బహిర్గతం చేశారు. దీంతో ప్రపంచ మొత్తం ఈ ఇద్దరి మహిళా అధికారులు గురించి చర్చ మొదలైంది. కల్నల్ సోఫియా ఖురేషీ గుజరాత్ వడోదరకు చెందిన సోఫియా.. బయో కెమిస్ట్రీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమెకు పీస్ కీపర్ గా అపార అనుభవం ఉంది. ఐక్యరాజ్య సమితికి చెందిన పీస్ మిషన్లో భాగంగా 2006లో కాంగోలో విధులు నిర్వర్తిం చారు. 2016లో పుణెలో జరిగిన 'ఎక్సర్సైజ్ 18' పేరిట భారత ఆర్మీకి చెందిన బృందానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు. అది మల్టీ నేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్, దానిలో 18 కంట్రీస్ పాల్గొన్నాయి. అన్ని దేశాలు ఉన్న ప్పటికీ.. ఒక్క భారత్ బృందానికి మాత్రమే మహిళ నాయకత్వం వహించడం గమనార్హం. అప్పుడు బలగాలు శాంతి పరిరక్షక కార్యకలా పాలు, మందుపాతర తొలగింపుపై దృష్టిసారించాయి. 1990ల్లో సోఫియా సైన్యంలో చేరారు. ఆర్మీ సిగ్నల్ కార్పస్క చెందిన సీజన్డ్ ఆఫీసర్. మూడు దశాబ్దాల ప్రయాణంలో ఆమె రాజీలేని వైఖరి ప్రదర్శించారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్.. చిన్నప్పుడే పైలట్ కావాలని కలలు కన్నారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. చదువుకు నే రోజుల్లో ఎన్సీసీలో చేరారు. ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆమె.. తన కలకు తగ్గట్టుగా భారత వైమానిక దళంలోని హెలికాప్టర్ పైలట్గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 18, 2019న ఫ్లయింగ్ బ్రాంచ్లో శాశ్వత కమిషన్ హోదా పొందారు. తన కుటుంబం నుంచి భారత భద్రతా బలగాల్లో చేరిన తొలి వ్యక్తి ఆమె కావడం విశేషం. జమ్మూకశ్మీర్, ఈశాన్య భారతంలోని ఎత్తైన ప్రాంతాలతో పాటు అత్యంత సవాలుతో కూడిన ప్రాంతాల్లో చేతక్, చీతా హెలికాప్టర్లను నడిపారు. పలు రెస్క్యూ ఆపరేషన్లలో పాలుపంచుకొన్నారు.

Tags

Next Story