Parliament : బీహార్‌లో ఓట్ల తొలగింపుపై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన

Parliament : బీహార్‌లో ఓట్ల తొలగింపుపై పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన
X

బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ అంశం పార్లమెంట్‌ సమావేశాలను కుదిపేస్తోంది. దీనిపై వారం రోజులుగా పార్లమెంట్‌లో ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేపడుతున్నారు. వరుసగా ఎనిమిదో రోజైన ఇవాళకూడా ఓటర్ల జాబితా సవరణపై విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు.

పార్లమెంట్‌ బయట ప్లకార్డులు, బ్యానర్‌లు పట్టుకొని నిరసన.

ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఓటమి భయంతోనే బీజేపీ ఓట్లను తొలగిస్తుందని మండిపడ్డారు. ఈ మేరకు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఆందోళనల్లో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకులు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌ సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు. దీంతోపాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మికుల అరెస్ట్‌లపై కూడా నిరసన తెలిపారు.

Tags

Next Story