IndiGo : 'ఇండిగో' ఇష్యూకు 4 కారణాలు.. డీజీసీఏ నిర్ణయంతో క్లియర్ అవుద్దా..?

IndiGo : ఇండిగో ఇష్యూకు 4 కారణాలు.. డీజీసీఏ నిర్ణయంతో క్లియర్ అవుద్దా..?
X

ఇండిగో ఫ్లైట్లు దేశ వ్యాప్తంగా ఇంకా రద్దవుతూనే ఉన్నాయి. ఈ రోజు 400లకు పైగా ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి. వేల సర్వీసులు రద్దవుతున్నాయి. ఇలా క్యాన్సిల్ కావడానికి నాలుగు రీజన్స్ ప్రధానంగా ఉన్నాయి. కొత్తగా వచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్స్ రూల్స్ ఒక రీజన్. ఈ సెకండ్ ఫేజ్ రూల్స్ ప్రకారం ఒక పైలట్ లేదా స్టాఫ్ రోజుకు 8 గంటలు, వారానికి 35 గంటలు, నెలకు 125 గంటలు, ఏడాదికి 1000 గంటల కంటే ఎక్కువ పనిచేయొద్దు. దీంతో తక్కువ మంది సిబ్బందితో ఫ్లైట్లు నడుపుతున్న ఇండిగోకు.. రెస్ట్ టైమ్ పెరగడంతో.. మిగతా టైమ్ లో ఫ్లైట్లు నడిపేవారు లేకుండా పోయారు. ఇంతకు ముందు వారానికి 36 గంటలు రెస్ట్ ఉంటే.. కొత్త రూల్స్ ప్రకారం 48 గంటలుంది.

గతంలో ఉన్న పనిగంటలకు తగ్గట్టే స్టాఫ్ ను మెయింటేన్ చేయడం పెద్ద మైనస్ అయింది. పైగా ఇండిగో అర్ధరాత్రి సమయంలోనే ఎక్కువ ఫ్లైట్లు నడుపుతోంది. ఇంతకు ముందు అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల మధ్య 6 ఫ్లైట్ ల్యాండింగ్స్ చేసేవాళ్లు. కొత్త రూల్స్ ప్రకారం దాన్ని 2కు తగ్గించారు. అందుకే పైలట్లు లేక ఇండిగో ఫ్లైట్లు రాత్రి సమయంలో ఎక్కువగా డిలే అవుతున్నాయి. కొత్త రూల్స్ ను అంచనా వేయలేక సరిగ్గా ప్లాన్ చేసుకోలేదని ఇండిగో సంస్థ డీజీసీఏకు వివరణ ఇచ్చింది. ఇంకో రీజన్ ఏంటంటే ఒకే ఫ్లైట్ ను ఎక్కువ ల్యాండింగ్స్ కోసం వాడుతోంది ఇండిగో.

కొత్త రూల్ ప్రకారం ఇండిగో ఫ్లైట్ డైలీ ల్యాండింగ్ లిమిట్ తగ్గింది. అయితే డీజీసీఏ ఈ కొత్త రూల్స్ మీద తాత్కాళిక సవరణ చేసింది. ఇండిగోకు మాత్రం ఈ వెసలుబాటు ఇచ్చింది. వారానికి గతంలో 36 గంటల రెస్ట్ టైమ్ ఉంటే.. దాన్ని కొత్త రూల్స్ ప్రకారం 48 గంటలు చేసిన విషయం తెలిసిందే. ఈ కొత్తగా పెంచిన వీక్లీ రెస్ట్ గంటలను సెలవులుగా పరిగణిస్తామని డీజీసీఏ తెలిపింది. అంటే పాత రూల్స్ ప్రకారం పైలట్స్ ఇక నుంచి పనిచేయొచ్చు. కాబట్టి పెంచిన రెస్ట్ టైమింగ్స్ లో కూడా పైలట్లు పనిచేస్తారు. దాని వల్ల ఫ్లైట్ డిలే కొంత వరకు తగ్గొచ్చు. కానీ వీలైనంత త్వరగా సిబ్బందిని రిక్రూట్ చేసుకోమని డీజీసీఏ ఆర్డర్ వేసింది. ఇండిగో ఆ మేరకు చర్యలు మొదలు పెట్టింది

Tags

Next Story