OYO Warning : యూత్‌కు ఓయో వార్నింగ్.. కొత్త చెకిన్ పాలసీ

ప్రముఖ హోటల్ అగ్రి గటర్ ఓయో రూమ్ బుకింగ్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త చెక్-ఇన్ పాలసీ తీసుకు వచ్చింది. ఈ సంవత్సరం వీటిని అమల్లోకి తీసుకు రానున్నట్లు ఓయో తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం ఇక నుంచి పెళ్లికాని జంటలకు ఓయో రూమ్స్ బుక్ చేసుకు నేందుకు అవకాశం ఉండదు. ఈ నిబంధనలు ముందుగా మీరట్ లో ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. క్రమంగా ఈ విధానాన్ని దేశమంతా విస్తరిస్తామని తెలిపింది. కొత్త చెక్-ఇన్ పాలసీ ఆధారంగా ఒక నుంచి ఆన్లైన్, ఆఫ్ లైన్ రూమ్ బుకింగ్ సమయంలో అన్ని జంటలు పెళ్లి చెల్లుబాటు అయ్యే రుజువులను చూపించాల్సి ఉంటుంది. పెళ్లి అయినట్లుగా ఐడీ ప్రూప్ చూపించాల్సి ఉం టుంది. ఓయో సురక్షితమైన బాధ్యతాయుతమైన అతిధ్య పద్ధతులను అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు సంస్థ నార్త్ ఇండియా రీజియన్ హెడ్ పవాస శర్మ చెప్పారు. కుటుంబాలు, విద్యార్ధులు, ఒంటరిగా ప్రయాణం చేసే వారికి సురక్షితమైన వసతులు అందించే బ్రాండ్ గా నిలవాలని ఓయో భావిస్తోందని ఆయన తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com