Jammu & Kashmir CM : పహల్గాం ఘటనతో కశ్మీరీలకే నష్టం : సీఎం ఒమర్ అబ్దుల్లా

Jammu & Kashmir CM : పహల్గాం ఘటనతో కశ్మీరీలకే నష్టం : సీఎం ఒమర్ అబ్దుల్లా
X

జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా అంశంపై సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ మొహం పెట్టుకొని రాష్ట్ర హోదా అడగాలన్నారు. 26 మంది అమాయకుల శవాలను అడ్డుగా పెట్టి రాష్ట్ర హోదా అడగలేనని అసెంబ్లీలో చెప్పారు. 26 మంది అమాయకుల మరణాన్ని వాడుకొని రాష్ట్ర హోదా అడిగేంత దిగజారుడు రాజకీయం తాను చేయనని తెలిపారు. రాజకీయాలకు ఓ లిమిట్ ఉండాలని.. అందులోను మనుషుల ప్రాణాలతో ముడిపడ్డ అంశాల్లో కచ్చితంగా లిమిట్స్ ఉండాలని అన్నారు. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో కూడా తెలియడం లేదన్నారు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత తమదే..తాను ఆ పనిచేయలేకపోయాను..వారి కుటుంబాలకు క్షమాపణలు చెప్పేందుకు తన వద్ద మాటలు కరువయ్యాయన్నారు జమ్ముకాశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా.

Tags

Next Story