Pak Former Minister : పాలస్తీనా బ్యాగ్: ప్రియాంక పై పాక్ మాజీ మంత్రి ప్రశంసలు

పార్లమెంటుకు ‘పాలస్తీనా’ బ్యాగు తీసుకెళ్లిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీని పాక్ మాజీ మంత్రి ఫవాద్ హుస్సేన్ ప్రశంసించారు. ‘ఫ్రీడమ్ ఫైటర్ నెహ్రూ ముని మనమరాలి నుంచి ఇంకేం ఆశించగలం? మరుగుజ్జుల మధ్య ఆమె మహోన్నతంగా నిలిచారు. పాక్ పార్లమెంటులో ఇప్పటి వరకు ఎవరూ ఆ ధైర్యం చేయకపోవడం సిగ్గుచేటు’ అని అన్నారు. బంగ్లా హిందువులపై జాలి చూపని ప్రియాంక ముస్లిములను మాత్రం బుజ్జగిస్తున్నారని ఇక్కడ విమర్శలు వచ్చాయి.
సోమవారం ప్రియాంక గాంధీ తన “పాలస్తీన్” అనే పదం, పాలస్తీన్ చిహ్నాలతో కూడిన ఒక హ్యాండ్బ్యాగ్‌ను ధరించి పార్లమెంట్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఈ బ్యాగ్ వివాదం గురించి విమర్శించారు. ఆమె చెప్పాలనుకున్న సందేశం ఏమిటి అని ప్రశ్నించారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న క్రూరత్వంపై ఆమె మౌనంగా ఉన్నప్పటికీ, పాలస్తీన్-థీమ్ బ్యాగ్‌తో ఫ్యాషన్ స్టేట్‌మెంట్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com