న్యాయ వ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ భేటీ

న్యాయ వ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ భేటీ
ఇవాళ ఢిల్లీలో న్యాయ వ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కీలక భేటీ కానుంది.

ఇవాళ ఢిల్లీలో న్యాయ వ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కీలక భేటీ కానుంది. ఈ సమావేశానికి న్యాయమంత్రిత్వశాఖ, లా కమిషన్ అధికారులు హాజరు కానున్నారు. న్యాయ వ్యవహారాల పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అధ్యక్షులుగా బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ ఉన్నారు. ఇక ఇవాల్టి సమావేశంలో ఉమ్మడి పౌర స్మృతిపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. యూసీసీ అమలు దిశగా మోదీ సర్కారు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దేశలో పౌరులందరికి ఒకే చట్టం ఉండాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు.ఇప్పటికే యూసీసీపై ఇప్పటికే ప్రజాభిసేకరణను ప్రారంభించింది లా కమిషన్. గతంలో ఉమ్మడి పౌరస్మృతి చట్టం అవసరాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావన చేసింది. అయితే రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. యూసీసీకి ఆప్, ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన, బీఎస్పీలు సానుకూలంగా ఉన్నాయి.అటు కాంగ్రెస్ మాత్రం వేచి చూసే ధోరణిలో ఉంది.

Tags

Read MoreRead Less
Next Story