దేశంలో ఎక్కడి నుంచైనా పెన్షన్ తీసుకోవచ్చు.. బ్రాంచ్ కు వెళ్లాల్సిన పనిలేదు..

దేశంలో ఎక్కడి నుంచైనా పెన్షన్ తీసుకోవచ్చు.. బ్రాంచ్ కు వెళ్లాల్సిన పనిలేదు..

ఈపీఎస్ పెన్షన్ దారులు దేశంలో ఎక్కడి నుంచైనా ఏ బ్యాంక్‌ నుంచైనా పెన్షన్‌ తీసుకోవచ్చు. ఈ మేరకు సెంట్రలైజ్డ్‌ పెన్షన్‌ పేమెంట్‌ సిస్టమ్‌ తీసుకొచ్చేందుకు ఈపీఎఫ్‌ ఆమోదం తెలిపినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి, ఈపీఎఫ్‌ ట్రస్ట్‌బోర్డ్‌ ఛైర్మన్‌ మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. 2025 జనవరి 1 నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని తెలిపారు. దీనివల్ల 78 లక్షల మంది పెన్షన్ దారులకు ప్రయోజనం ఉంటుందన్నారు.ఈపీఎఫ్‌వో మోడిఫికేషన్ లో సెంట్రలైజ్డ్‌ పేమెంట్ సిస్టమ్‌ కీలక మైలురాయిని అని మాండవీయ పేర్కొన్నారు. పెన్షన్ దారులు ఏళ్లుగా చేస్తున్న డిమాండ్‌కు దీంతో పరిష్కారం లభిస్తుందని చెప్పారు. దీనివల్ల పెన్షనర్లు ఇకపై దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఏ బ్యాంక్‌కు చెందిన ఏ శాఖ నుంచైనా పెన్షన్ పొందే వీలుంటుందన్నారు. పెన్షన్ దారులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లినప్పుడు పెన్షన్ పేమెంట్‌ ఆర్డర్‌ బదిలీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. దీంతో పాటు ఏదైనా బ్యాంక్‌ లేదా శాఖ మార్చుకోవాల్సిన సందర్భంలోనూ ఈ సదుపాయం ఉపయోగపడనుంది.

ప్రస్తుత పెన్షన్ పంపిణీ వ్యవస్థలో సీపీపీఎస్‌ సమూల మార్పులకు శ్రీకారం చుట్టనుంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ జోనల్/ప్రాంతీయ కార్యాలయాలు కేవలం 3-4 బ్యాంకులతో మాత్రమే ఒప్పందాలు కలిగి ఉన్నాయి. పెన్షన్ ప్రారంభ సమయంలో పెన్షన్ దారులు ధ్రువీకరణ కోసం సంబంధిత బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సెంట్రలైజ్డ్‌ విధానం వల్ల బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం తప్పనుంది. అంతేకాదు పెన్షన్‌ విడుదలైన వెంటనే ఆ మొత్తం ఖాతాలో జమ అవుతుంది. ఈ కొత్త వ్యవస్థతో పెన్షన్ పంపిణీలో ఖర్చు సైతం తగ్గుతుందని ఈపీఎఫ్‌వో భావిస్తోంది. తదుపరి దశలో ఆధార్‌ ఆధారిత పేమెంట్‌ సిస్టమ్‌నును కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు మాండవీయ చెప్పారు.

Tags

Next Story