Himachal Pradesh Bill : ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెన్షన్ కట్.. హిమాచల్ బిల్లు
పార్టీ ఫిరాయింపులపై హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీలు మారిన ఎమ్మెల్యేలకు పెన్షన్ నిలిపేయనుంది. ఇందుకు సంబంధించిన సవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆమోదించింది. ఫిరా యింపుల నిరోధక చట్టంకింద అనర్హత వేటును ఎదుర్కొన్న ఎమ్మెల్యేలకు ఈ కొత్త నిబంధన వర్తించనుంది.
ఫిరాయింపులను అరికట్టేందుకు హిమాచల్ ప్రదేశ్ శాసనసభ (సభ్యుల పింఛన్లు, అలవెన్సులు) సవరణ బిల్లు-2024ను రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనిపై సుదీర్ఘంగా చర్చించిన మీదట ఓటింగ్ నిర్వహించి బిల్లును సభ ఆమోదిం చింది. ఏదైనా ఒక సమయంలో ఫిరాయింపు నిరోధక చట్టంకింద అనర్హత వేటును ఎదుర్కొన్న శాసనసభ్యులకు ఇకపై పింఛను పొందలేరని బిల్లులో స్పష్టంగా చెప్పారు.
హిమాచల్లో ప్రస్తుతం, ఐదేళ్లకాలం ఎమ్మెల్యేగా పనిచేసిన శాసనసభ్యులకు నెలకు రూ.36 వేలు పింఛను లభిస్తుంది. ఐదేళ్లకు మించి పదవీకాలం ఉన్న ఎమ్మెల్యేలకు ఏటా మరో రూ. వెయ్యి అదనంగా పెన్షన్ చెల్లిస్తున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com