Assam: వరద బీభత్సం.. ఇళ్లు కోల్పోయి రైల్వే ట్రాక్‌పై 500 కుటుంబాలు..

Assam: అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత ఐదు రోజులుగా భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. వందల గ్రామాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. దాంతో వాహనాల రాకపోకలకు అంతరాయడం ఏర్పడింది. కొండ చరియలు విరిగిపడటం, రైల్వే ట్రాక్‌లు, వంతెనలు దెబ్బనడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. న్యూ హఫ్లాంగ్ రైల్వే స్టేషన్ పూర్తిగా వరదల్లో మునిగిపోయింది. వరదనీరు పోటెత్తడంతో రెండు రైళ్లు మునిగిపోయాయి.
ఆర్మీ, పారా మిలటరీ దళాలు, ఎస్‌డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపడుతున్నాయి. 55 తాత్కాలిక పునరావాస శిబిరాలు ఏర్పాటు చేసి.. బాధితులను అక్కడకు తరలించారు అధికారులు. ఇప్పటివరకు 27 మంది మృతి చెందినట్లు అసోం ప్రభుత్వం తెలిపింది. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు. పంటలు నాశనమయ్యాయి.
ఇదిలా ఉండగా 500లకు పైగా కుటుంబాలు నిరాశ్రయిలయ్యారు. పలు గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోవడంతో వీరంతా ప్రస్తుతం రైల్వే ట్రాక్‌పైనే నివసిస్తున్నారు. రైల్వే ట్రాక్ కాస్త ఎత్తులో ఉండడంతో అక్కడికి వరద నీరు రాలేదు. దీంతో ఈ కుటుంబాలు అక్కడే గుడారాలు వేసుకొని ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాల నుండి వారికి ఏ సాయం అందడం లేదని వారు వాపోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com