Kangana Ranaut : అమితాబ్ భార్య కాబట్టే ప్రజలు సైలెంట్‌గా ఉంటున్నారు

బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సీనియర్ నటి, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ప్రవర్తనను లక్ష్యంగా చేసుకుని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఒక వ్యక్తి పట్ల జయా బచ్చన్ ప్రవర్తించిన తీరుపై ఆమె తీవ్రంగా స్పందించారు.
అసలేం జరిగింది?
ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరైన జయా బచ్చన్‌ను ఒక వ్యక్తి సెల్ఫీ కోసం పలకరించగా, ఆమె ఆ వ్యక్తిని పక్కకు నెట్టేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతంలో కూడా మీడియా ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్లపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి. తాజా వీడియోతో ఆమె ప్రవర్తన మరోసారి చర్చనీయాంశమైంది.
కంగనా స్పందన
ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన కంగనా, జయపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘జయా బచ్చన్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ భార్య కాబట్టి ఆమెను ప్రజలు భరిస్తున్నారు. ఆమె ప్రవర్తించిన తీరు అవమానకరం, సిగ్గుచేటు’’ అని కంగనా ఎద్దేవా చేశారు. కంగనా పోస్ట్‌తో ఈ వివాదం మరింత పెద్దదైంది. జయా బచ్చన్ ప్రవర్తనను కొందరు నెటిజన్లు తప్పుబడుతుండగా, మరికొందరు ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదని మద్దతుగా నిలిచారు. మొత్తానికి, ఈ అంశం బాలీవుడ్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com