Petition In Supreme Court : కుంభమేళా తొక్కిసలాటపై సుప్రీంలో పిటిషన్

Petition In Supreme Court : కుంభమేళా తొక్కిసలాటపై సుప్రీంలో పిటిషన్
X

కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. విశాల్ తివారీ అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని వేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన, విధానపరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని అందులో కోరారు. భక్తుల భద్రత ప్రమాదంలో పడకుండా నివారించేలా వీఐపీల కదలికలను ఆపాలని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఈ వ్యాజ్యం నేపథ్యంలో తొక్కిసలాటపై యూపీ ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాల్సి ఉంటుంది జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు జరగనుంది. ఈ వేడుక ముగింపు నాటికి 40 కోట్లకు పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు.

Tags

Next Story