Petition on Dargah : దర్గాపై పిటిషన్.. ముదురుతున్న వివాదం
మతపరమైన ప్రార్థనా స్థలాల ఉనికిని సవాల్ చేస్తూ పలువురు కోర్టును ఆశ్రయిస్తున్నారు. సంభల్ అల్లర్లు చల్లారకముందే తాజాగా అజ్మీర్ షరీఫ్ దర్గా ప్రదేశంలో గతంలో శివాలయం ఉండేదంటూ పిటిషన్ దాఖలైంది. శ్రీకృష్ణ జన్మభూమి ట్రస్ట్ భూమిలో ఈద్గాను నిర్మించారంటూ మథురలో, మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో, వారణాసిలోని జ్ఞానవాపిలో ప్రార్థనా స్థలాల ఉనికిని సవాల్ చేస్తూ వరుస పిటిషన్లు దాఖలవ్వడంతో ఈ తరహా వివాదాలు అధికమయ్యాయి.
దేశంలోని ప్రార్థనా స్థలాల పరిరక్షణకు ఈ చట్టంలో కీలక నిబంధనలు ఉన్నాయి. ఆగస్టు 15, 1947 నాటికి మతపరమైన ప్రదేశాల్లో అప్పటికే ఉన్న ప్రార్థనా విధానాలను కొనసాగించాలి. ప్రార్థనా స్థలాల్ని మరొక మతంలోకి మార్చాలనే అభ్యర్థనలను న్యాయపరిధిలో సవాల్ చేయడం నిషేధం (బాబ్రీ మసీదుకు మినహాయింపు). అయితే ప్రస్తుతం ఇలాంటి వివాద పిటిషన్లను కింది కోర్టులు సైతం విచారణకు అనుమతించడం గమనార్హం.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com