PM Kisan : అన్నదాతల ఖాతాల్లోకి నోట్ల వర్షం..పీఎం కిసాన్ 22వ విడత డేట్ ఫిక్స్.

PM Kisan : అన్నదాతల ఖాతాల్లోకి నోట్ల వర్షం..పీఎం కిసాన్ 22వ విడత డేట్ ఫిక్స్.
X

PM Kisan : భారతదేశంలోని అన్నదాతలకు పీఎం కిసాన్ పథకం ఒక కొండంత అండగా మారింది. ఇప్పటివరకు ప్రభుత్వం విజయవంతంగా 21 విడతల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు అందరి కళ్లు 22వ విడత మీద ఉన్నాయి. సాధారణంగా ఈ నిధులు ఏడాదికి మూడుసార్లు (ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి) విడుదలవుతాయి. గత ఏడాది నవంబర్‌లో 21వ విడత ఇచ్చారు కాబట్టి, తదుపరి విడత డిసెంబర్ 2025 నుండి మార్చి 2026 లోపు రావాల్సి ఉంది. తాజా సమాచారం ప్రకారం..కేంద్ర ప్రభుత్వం మార్చి నెలాఖరులో లేదా ఏప్రిల్ మొదటి వారంలో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే అవకాశం ఉంది.

ఈసారి కేవలం రూ.2,000 జమ కావడమే కాదు, అంతకంటే పెద్ద శుభవార్త వినే ఛాన్స్ ఉంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఎం కిసాన్ నిధులను పెంచుతున్నట్లు ప్రకటించవచ్చని ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం రైతులకు ఏడాదికి మూడు విడతల్లో మొత్తం రూ.6,000 అందుతున్నాయి. పెరిగిన పెట్టుబడి ఖర్చులు, ఎరువుల ధరలను దృష్టిలో ఉంచుకుని ఈ మొత్తాన్ని రూ.8,000 లేదా రూ.10,000 కు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే అన్నదాతల ఆనందానికి అవధులు ఉండవు.

చాలామంది రైతులకు అన్ని అర్హతలు ఉన్నా ఖాతాల్లో డబ్బులు పడవు. దీనికి ప్రధాన కారణం ఈ-కేవైసీ పూర్తి చేయకపోవడమే. ప్రభుత్వం దీనిని ఇప్పటికే తప్పనిసరి చేసింది. కేవైసీ పూర్తి చేయని రైతులకు 22వ విడత నిధులు అందవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మీరు ఇంకా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే, వెంటనే పీఎం కిసాన్ అధికారిక పోర్టల్(pmkisan.gov.in)కి వెళ్లి ఆధార్ నంబర్, ఓటీపీ ద్వారా ఇంట్లో కూర్చునే వెరిఫికేషన్ చేసుకోవచ్చు. మీ ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే కేవలం రెండు నిమిషాల్లో ఈ పని పూర్తవుతుంది.

వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి?

రైతులు తమ సమీపంలోని మీ-సేవా లేదా CSC సెంటర్లకు వెళ్లి కూడా కేవైసీ పూర్తి చేయవచ్చు. అటెన్షన్ ప్లీజ్.. మీ భూమి రికార్డుల మ్యాపింగ్ కూడా సరిగ్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఫిబ్రవరి బడ్జెట్ తర్వాత వచ్చే ఈ నిధులు రైతులకు ఎంతో ఊరటనిస్తాయి. కేవలం డబ్బులే కాకుండా, రైతులకు మరిన్ని ఇన్స్యూరెన్స్, సబ్సిడీ పథకాలను కూడా బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉంది.

Tags

Next Story