భారత్‌కి అన్ని అర్హతలు ఉన్నాయి: PM మోదీ

భారత్‌కి అన్ని అర్హతలు ఉన్నాయి: PM మోదీ
ప్రపంచానికి భారత్‌ పెద్దన్న పాత్ర పోషించటాని అన్ని అర్హతలు ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు.

ప్రపంచానికి భారత్‌ పెద్దన్న పాత్ర పోషించటాని అన్ని అర్హతలు ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఏ దేశాన్నో పడగొట్టడం ద్వారా కాకుండా ఒక హక్కుగా దీనిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న మోదీ ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో విస్తృత పాత్ర పోషించేందుకు భారత్‌ అర్హమైనదేన్నారు. ప్రపంచంలో ఎక్కడ శాంతి పరిరక్షక దళాల సేవలు అవసరమైనా భారత్‌ సైనికులు వెళ్తున్నారని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ప్రస్తుత సభ్యత్వాలను పెంచాలన్నారు. దీనిలో భారతదేశం ఉండాలా వద్దా అని ప్రపంచాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, ప్రచ్ఛన్నయుద్ధం, విస్తరణవాదం వంటివి ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలని చెప్పారు. ప్రపంచ సంస్థల వైఫల్యం వల్ల చిన్నచిన్న కూటములు ఏర్పాటవుతున్నాయనీ, ఐక్యరాజ్యసమితి వంటివి మారితీరాలన్నారు ప్రధాని మోదీ.

ఉక్రెయిన్‌పై ఏడాదికి పైగా రష్యా సాగిస్తున్న యుద్ధం విషయంలో తాము శాంతివైపే ఉన్నామని మోదీ చెప్పారు. తాము తటస్థ వైఖరి ప్రదర్శిస్తున్నామని కొంతమంది అంటున్నారని.. అయితే తాము తటస్థం కాదని శాంతివైపు నిలబడుతున్నామని చెప్పారు. దేశాల సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను ప్రతి దేశం గౌరవించాలన్నారు. దౌత్యపరమైన మార్గాలు, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. అంతేగానీ యుద్ధంతో కాదన్నారు. సమస్య పరిష్కారం కోసం రష్యా, ఉక్రెయిన్‌ దేశాధినేతలు పుతిన్‌, జెలెన్‌స్కీలతో తాను పలుమార్లు మాట్లాడినట్లు గుర్తుచేశారు. భారత్‌ ఏం చేయగలదో అన్నీ చేస్తోందనిఘర్షణలను పరిష్కరించి ఇరు దేశాల మధ్య శాంతి, సుస్థిరత సాధించే అన్ని ప్రయత్నాలను తాము సమర్థిస్తున్నామని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story