Rajinikanth : రజినీకాంత్ ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ ఆరా

Rajinikanth : రజినీకాంత్ ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ ఆరా

ఆస్పత్రిలో చేరిన సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్యం గురించి ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. లతా రజినీకాంత్‌కి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తెలిపారు. ‘శస్త్రచికిత్స జరిగిందని, క్షేమంగా ఉన్నారని చెప్పారు. తలైవా త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు’ అని పేర్కొన్నారు. రజనీకాంత్ అస్వస్థత కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్యులు స్టెంట్ వేశారు. గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళంలో వాపు వచ్చిందని, దాంట్లో స్టెంట్ అమర్చినట్టు ఆసుప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపాయి. మరో రెండు రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వెల్లడించాయి.

Tags

Next Story