PM Kisan : 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 18,000 కోట్లు.. డబ్బులు పడకపోతే ఇలా చేయండి.

PM Kisan : 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ. 18,000 కోట్లు.. డబ్బులు పడకపోతే ఇలా చేయండి.
X

PM Kisan : దేశంలోని రైతులకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 21వ విడత నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన సహజ వ్యవసాయ సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఈ నిధులను విడుదల చేశారు. ఈ విడతలో మొత్తం 9 కోట్ల మంది రైతులకు రూ. 18,000 కోట్లకు పైగా సొమ్ము నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయింది.

పథకం వివరాలు, నిధుల విడుదల

పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2,000 చొప్పున, ఏడాదికి మొత్తం రూ. 6,000 ను కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ డబ్బును నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. తాజాగా 21వ విడత కింద రూ. 18,000 కోట్లకు పైగా విడుదల చేశారు. దీనికి ముందు 20వ విడత ఆగస్టులో విడుదల చేశారు. ఆ సమయంలో 2.4 కోట్ల మంది మహిళా రైతులతో సహా 9.8 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. ఇప్పటివరకు విడుదల చేసిన 20 విడతలలో ప్రధాన మంత్రి మోదీ ఈ పథకం కింద రూ. 3,90,000 కోట్లకు పైగా నిధులను పంపిణీ చేశారు.

పీఎం కిసాన్ పథకంలో కొత్తగా రిజిస్టర్ చేసుకునే విధానం

పీఎం కిసాన్ పథకంలో కొత్తగా నమోదు చేసుకోవాలనుకునే అర్హులైన రైతులు ఈ కింది విధానాన్ని పాటించవచ్చు:

* ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ అయిన pmkisan.gov.in ను సందర్శించండి.

* హోమ్ పేజీలో కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే ఫార్మర్స్ కార్నర్ అనే విభాగం కనిపిస్తుంది.

* అక్కడ న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేయండి.

* తరువాత మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. మీ రాష్ట్రాన్ని ఎంచుకుని, OTP కోసం రిక్వెస్ట్ పంపాలి.

* OTP ఎంటర్ చేసిన తర్వాత, పేరు, భూమి వివరాలు, పహాణీ కాపీ వంటి అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, ఫారమ్ పూర్తి చేయాలి.

* చివరిగా 'సేవ్' బటన్‌ను క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

డబ్బులు పడకపోతే ఏం చేయాలి?

మీరు పీఎం కిసాన్ పథకం లబ్ధిదారు అయినప్పటికీ, 21వ విడత డబ్బు మీ ఖాతాలో జమ కాకపోతే, ఈ కింది చర్యలు తీసుకోవచ్చు:

* వ్యవసాయ కార్యాలయాలు/సీఎస్సీ సెంటర్లు: సహాయం కోసం మీ స్థానిక వ్యవసాయ కార్యాలయాన్ని లేదా సీఎస్సీ సర్వీస్ సెంటర్ ను సంప్రదించండి.

* పరిశీలన: మీ విడత డబ్బులు రిజెక్ట్, పెండింగ్, స్టాప్ డ్ అని చూపిస్తే, ఈ కేంద్రాలలో విచారణ చేయవచ్చు.

* సమస్యల పరిష్కారం: ఆధార్ ధృవీకరణ , KYC, బ్యాంకు వివరాలు సరిపోలకపోవడం వంటి ఇతర సమస్యలను ఈ కేంద్రాల సిబ్బంది పరిష్కరించడానికి సహాయం చేస్తారు.

Tags

Next Story