PM Modi: ట్రంప్‌తో మాట్లాడేందుకు నేను రెడీ.. ఎక్స్‌లో మోడీ రిప్లై

సుంకాలు కారణంగా భారత్-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి తరుణంలో భారత్ ప్రధాని మోడీ తనకు మంచి స్నేహితుడని.. మాట్లాడేందుకు ఎదురుచూస్తున్నట్లు ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాకుండా వాణిజ్యం విషయంలో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటాయని చెప్పడానికి సంతోషిస్తున్నట్లు పేర్కొన్నారు.
ట్రంప్ పెట్టిన పోస్ట్‌కు ప్రధాని మోడీ కూడా రిప్లై ఇచ్చారు. ట్రంప్‌తో మాట్లాడేందుకు తాను కూడా ఎదురుచూస్తున్నట్లు మోడీ పేర్కొన్నారు. భారత్-అమెరికా సన్నిహిత స్నేహితులని.. అంతేకాకుండా సహజ భాగస్వాములు అని తెలిపారు. తిరిగి రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఈ చర్చలను వీలైనంత త్వరగా ముగించడానికి మా బృందాలు కృషి చేస్తాయని వెల్లడించారు. రెండు దేశాల ప్రజలకు మంచి భవిష్యత్‌ను ఇచ్చేందుకు కలిసి పని చేస్తామని మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ట్రంప్ మొదటి పరిపాలనలో మోడీతో మంచి సంబంధాలు ఉన్నాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక కొద్ది రోజులు మోడీ-ట్రంప్ మధ్య మంచి సంబంధాలే కొనసాగాయి. అయితే తొలుత భారత్‌పై ట్రంప్ 25 శాతం సుంకం విధించారు. అనంతరం కొద్దిరోజులకే రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు జరిమానాగా మరో 25 శాతం సుంకం విధిస్తున్నట్లు బాంబ్ పేల్చారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం విధించినట్లైంది. అంటే అన్ని దేశాల కంటే భారత్‌పైనే ఎక్కువ సుంకం విధించారు. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇక రష్యా దగ్గరే చమురు కొనుగోలు చేస్తామని భారత్ తేల్చి చెప్పింది. ఇక అన్నదాతల కోసం సుంకాలు ఎంతైనా భరిస్తామంటూ ప్రధాని మోడీ ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com