మొదట్లో అలా జరుగుతుందని భావించలేదు : ప్రధాని నరేంద్ర మోదీ

కరోనా సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటున్నామని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ మహమ్మారి ప్రజా , ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. అమెరికా, భారత్ వ్యూహాత్మక, భాగస్వామ్య సదస్సును ఉద్దేశించి మోదీ ప్రసగించారు. 2020 సంవత్సరం అనేక సవాళ్లను విసురుతుందని ప్రారంభంలో ఎవరూ భావించలేదని చెప్పారు. వైరస్ వ్యాప్తి చెందకుండానే అనేక చర్యలను తీసుకున్నామని, ప్రజలను అప్రమత్తం చేశామని అన్నారు. మాస్క్‌లు, శానిటైజర్ల వినియోగం, భౌతిక దూరం గురించి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చామని ప్రధాని తెలిపారు.
ప్రారంభంలో ఒక కరోనా ల్యాబొరేటరీతో టెస్టులను ప్రారంభించామని, ఇప్పుడు ఆ సంఖ్య వందల్లో ఉందని అన్నారు. అగ్రరాజ్యం అమెరికాతో భారత్ ఎలాంటి వ్యూహాలను అనుసరిస్తోందనే విషయాన్ని ప్రస్తావించారు మోదీ . ఈ సమ్మిట్ వల్ల వ్యాపారం, వాణిజ్యం, విదేశీ వ్యవహారాలు, ఆర్థికం, దౌత్యం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతోన్న సంబంధాలు మరింత బలోపేతమౌతాయని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com