PM Modi : మోదీ అమెరికా టూర్ ఫిక్స్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( Narendra Modi ) అమెరికా పర్యటన ఖరారైంది. ఈ నెల 21 నుంచి 23వ తేదీవరకు అమెరికాల ప్రధాని మోదీ పర్యటించనున్నట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. సెప్టెంబరు 21న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆధ్వర్యంలో విల్మింగ్టన్ వేదికగా నిర్వహించనున్న నాలుగో ‘క్వాడ్ సదస్సు’లో పాల్గొననున్నారు. సెప్టెంబరు 22న న్యూయార్క్‌లో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. కృత్రిమ మేధ, బయోటెక్నాలజీ, సెమీకండక్టర్లు తదితర రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకుగాను ప్రముఖ సంస్థల సీఈవోలతో భేటీ కానున్నారు. భారత్- అమెరికా సంబంధాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రముఖులతోనూ సంభాషించనున్నారు. సెప్టెంబరు 23న న్యూయార్క్‌లోని ఐరాస జనరల్ అసెంబ్లీలో ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’నుద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా అనేక మంది ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని విదేశాంగశాఖ తెలిపింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com