PM Modi: నేటినుంచి ఇథియోపియాలో మోడీ పర్యటన..

PM Modi: నేటినుంచి ఇథియోపియాలో మోడీ పర్యటన..
X
డిజిటల్ హోర్డింగ్‌ల్లో తళుక్కుమని మెరుస్తున్న మోడీ

మూడు దేశాల పర్యటన కోసం సోమవారం ప్రధాని మోడీ జోర్డాన్ చేరుకున్నారు. అక్కడ ప్రధాని మోడీకి జోర్డాన్ ప్రధానమంత్రి జాఫర్ హసన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు.

ఇక ఈరోజు ఇథియోపియాకు ప్రధాని మోడీ వెళ్లనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు ఇథియోపియాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇథియోపియాలో మోడీకి డిజిటల్ హోర్డింగ్‌లో స్వాగత ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం డిజిటల్ హోర్డింగుల్లో మోడీ ప్రత్యక్షమవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇథియోపియా పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. ఇథియోపియన్ ప్రధాని డాక్టర్ అబియ్ అహ్మద్ అలీతో మోడీ విస్తృత చర్చలు జరపనున్నారు. ఇక ఇథియోపియా పర్యటన తర్వాత మోడీ ఒమన్ దేశానికి వెళ్లనున్నారు.

మంగళవారం మోదీ, రాజు అబ్దుల్లా కలిసి భారత్–జోర్డాన్ వ్యాపార సదస్సులో మాట్లాడతారు. దీనికి రెండు దేశాల ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరవుతారు. మోదీ జోర్డాన్‌‌‌‌లోని భారతీయ సమాజంతో కూడా సమావేశమవుతారు. పరిస్థితులు అనుకూలిస్తే క్రౌన్ ప్రిన్స్‌‌‌‌తో కలిసి చారిత్రక నగరం పెట్రాను సందర్శించే అవకాశం ఉంది. పెట్రాకు భారత్‌‌‌‌తో పురాతన వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. ఇది మోదీ మొదటి పూర్తి స్థాయి ద్వైపాక్షిక జోర్డాన్ పర్యటన. 2018లో పాలస్తీనా వెళ్లే మార్గంలో ఆయన జోర్డాన్‌‌‌‌లో ఆగారు. అప్పుడు రాజు మోదీకి ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు. 37 ఏండ్ల తర్వాత భారత ప్రధాని జోర్డాన్ లో పూర్తిస్థాయిలో పర్యటన చేస్తున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్య బంధం బలంగా ఉంది. భారత్–జోర్డాన్‌‌‌‌కు మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ద్వైపాక్షిక వాణిజ్యం 2.8 బిలియన్ డాలర్లుగా ఉంది. జోర్డాన్ నుంచి ఫాస్ఫేట్లు, పొటాష్ తదితర ఎరువులు భారత్ కు దిగుమతి అవుతున్నాయి.

Tags

Next Story