మోదీ జపాన్ పర్యటన..హిరొషిమాలో గాంధీ విగ్రహావిష్కరణ

జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ హిరొషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలువురి ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. ప్రపంచంలోనే శక్తివంతమైన దేశాల సమావేశానికి జపాన్‌లోని హిరోషిమా వేదికైంది. జి-7 వార్షిక సదస్సులో పాల్గొనడం తోపాటు.. పలువురు నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు మోదీ. జీ-7 సదస్సు నేపథ్యంలో జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో పాటు.. మరికొన్ని దేశాల నేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు.
ఈ వారంలో జపాన్‌లోని హిరోషిమాలో.. క్వాడ్ గ్రూపు నేతల సమావేశం కూడా జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ జీ-7 వార్షిక సదస్సులో పాల్గొననున్నారు.
భారత్ మూడు అధికారిక సెషన్లలో పాల్గొంటుంది. ఇందులో మొదటి రెండు సెషన్లు మే 20న, మూడో సెషన్ మే 21న జరుగనుంది. మొదటి రెండు సెషన్లలో థీమ్‌లు ఆహారం, ఆరోగ్యం, లింగ సమానత్వం, వాతావరణ మార్పులు, పర్యావరణం ఉంటాయి. మూడో సెషన్‌లో శాంతియుత, స్థిరమైన ప్రగతిశీల, ప్రపంచం వంటి అంశాలపై చర్చించున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com