PM Modi: లావోస్ పర్యటనకు ప్రధాని మోదీ

PM Modi: లావోస్ పర్యటనకు ప్రధాని మోదీ
X
అక్టోబర్ 10, 11 తేదీల్లో లావోస్ లో పర్యటించనున్న మోడీ..

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు లావోస్‌ పర్యటనకు వెళ్లబోతున్నారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో ఆయన లావోస్‌లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సందర్భంగా మోడీ 21వ ఆసియాన్- ఇండియా సమ్మిట్.. 19వ ఈస్ట్‌ ఏషియా సదస్సులో పాల్గోనున్నారు. ప్రస్తుతం ఆసియాన్-ఇండియాకు లావోస్‌ అధ్యక్షతగా బాధ్యత వహిస్తుంది.

ఈ సమావేశాల్లో భారత్‌ వివిధ దేశాలతో భాగస్వామ్య ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలపై చర్చించే అవకాశముందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా మోదీ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక విషయాలకు సంబంధించిన సమావేశాల్లోనూ పాల్గోనున్నారని సమాచారం. ‘‘భారతదేశంలో యాక్ట్ ఈస్ట్ పాలసీ వచ్చి దశాబ్దకాలం అవుతోంది. ఈ పాలసీ ఇండో-పసిఫిక్ అభివృద్ధికి కీలక స్తంభం వంటిది’’ అని విదేశాంగ శాఖ పేర్కొంది.

కాగా రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం వేళ ప్రధాని నరేంద్రమోదీ ఇరుదేశాలను సందర్శించి.. యుద్ధం ముగింపు విషయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన ఇటలీ, అమెరికాలోనూ పర్యటించారు. ప్రస్తుతం మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు భారత పర్యటనలో ఉన్నారు. ఇందులోభాగంగా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీతో విస్తృతస్థాయిలో సమాలోచనలు జరిపారు.

Tags

Next Story