మహిళా రిజర్వేషన్ బిల్లు చుట్టూ కొత్త రాజకీయం..

మహిళా రిజర్వేషన్ బిల్లు చుట్టూ కొత్త రాజకీయం..
X

దేశంలో ఇప్పుడు కొత్త రాజకీయం మొదలైంది. అది కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు చుట్టూ. ఎందుకంటే ఈ బిల్లు నిన్న పార్లమెంట్ లో వీగిపోయింది. అపోజిషన్ పార్టీలు మాత్రం.. 2023లోనే మహిళలకు రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చామని.. దాన్నే అమలు చేయాలని పట్టుబడుతున్నాయి. కొత్త బిల్లు వల్ల డీలిమిటేషన్ ను పాస్ చేయించుకోవాలని చూస్తున్నారని.. దానికి ఒప్పుకునేది లేదని చెబుతున్నాయి. అటు ఎన్డీయే ప్రభుత్వం మాత్రం.. ప్రధాని నరేంద్ర మోడీకి మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ దక్కుతుందనే ఉద్దేశంతోనే ఇలా ప్రతిపక్షాలు వ్యతిరేకించాయని చెబుతోంది. మహిళల హక్కులను విపక్షాలు కాలరాశాయని.. వారికి వచ్చే ఎన్నికల్లో మహిళలు గట్టి బుద్ధి చెప్తారని కేంద్రం స్పష్టంగా చెబుతోంది.

ఇండియా కూటమి మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలు చేయడానికి కేంద్రం రెడీ అయింది. మూడు రోజుల పాటు ఈ నిరసనలు చేయాలని.. ప్రజలకు కాంగ్రెస్ కూటమి చేస్తున్న అన్యాయాన్ని వివరించాలని కేంద్రం ప్లాన్ చేసింది. దాన్ని అపోజిషన్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. డీలిమిటేషన్ తో సంబంధం లేకుండా ఇప్పుడున్న 543 ఎంపీ సీట్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతున్నాయి.

మోడీ గవర్నమెంట్ ఆ పని చేయకుండా.. మహిళా రిజర్వేషన్ల బిల్లును చూపించి డీలిమిటేషన్ బిల్లును పాస్ చేయించుకోవడానికి ప్లాన్ చేస్తోందని.. అందుకే దాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు చెబుతున్నాయి అపోజిషన్ పార్టీలు. ఇలా అటు ఎన్డీయే కూటమికి, ఇండియా కూటమికి మధ్య తీవ్రమైన వాగ్వాదాలు జరుగుతున్నాయి. కానీ ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తున్నారనేది రాబోయే ఎన్నికల్లో తేలిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Tags

Next Story