Post Office : రోజుకు రూ.411 పొదుపుతో రూ.43 లక్షలు మీ సొంతం..పోస్టాఫీస్ బంపర్ హిట్ స్కీమ్.

Post Office : రోజుకు రూ.411 పొదుపుతో రూ.43 లక్షలు మీ సొంతం..పోస్టాఫీస్ బంపర్ హిట్ స్కీమ్.
X

Post Office : కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడ పెడితే సురక్షితంగా ఉంటుంది? స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు లేకుండా మంచి లాభాలు ఎలా వస్తాయి? అని ఆలోచించే వారికి పోస్ట్ ఆఫీస్ పిపిఎఫ్ ఒక అద్భుతమైన వరం. ఇది కేవలం పొదుపు పథకం మాత్రమే కాదు, దీర్ఘకాలంలో మిమ్మల్ని లక్షాధికారిని చేసే ఒక మనీ మెషిన్. రోజుకు కేవలం రూ. 411 పొదుపు చేస్తూ, భవిష్యత్తులో రూ. 43 లక్షల భారీ నిధిని ఎలా సమకూర్చుకోవచ్చో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

పెట్టుబడి విషయంలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. ప్రస్తుతం పీపీఎఫ్ పథకంపై ప్రభుత్వం 7.9% వడ్డీని అందిస్తోంది. మీరు రోజుకు రూ.411 పొదుపు చేస్తే, నెలకు సుమారు రూ.12,500 అవుతుంది. అంటే సంవత్సరానికి మీరు రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు. ఈ పథకం గడువు 15 ఏళ్లు. ఇలా మీరు 15 ఏళ్ల పాటు ప్రతి ఏటా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేస్తూ వెళ్తే, గడువు ముగిసేసరికి మీ చేతికి రూ.43,60,517 అందుతాయి. ఇందులో మీరు పెట్టిన పెట్టుబడి రూ.22.5 లక్షలు కాగా, కేవలం వడ్డీ రూపంలోనే ప్రభుత్వం మీకు దాదాపు రూ.21 లక్షలు అదనంగా ఇస్తుంది.

చాలా మంది ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆదాయపు పన్ను గురించి భయపడతారు. కానీ పీపీఎఫ్ EEE విభాగంలోకి వస్తుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసే అసలుపై ట్యాక్స్ ఉండదు, వచ్చే వడ్డీపై ట్యాక్స్ ఉండదు, చివరలో మీకు అందే రూ.43 లక్షలపై కూడా ఒక్క రూపాయి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. సెక్షన్ 80C కింద ఏడాదికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా, ఇది భారత ప్రభుత్వం మద్దతు ఉన్న పథకం కాబట్టి మీ సొమ్ముకు వంద శాతం సావరీన్ గ్యారెంటీ ఉంటుంది. బ్యాంకుల కన్నా ఇది చాలా సురక్షితం.

ఈ పథకంలో మరో గొప్ప విషయం ఏంటంటే.. మీకు అత్యవసరంగా డబ్బు అవసరమైతే, ఖాతా తెరిచిన మూడవ ఏడాది నుంచి ఆరవ ఏడాది లోపు మీ డిపాజిట్లపై లోన్ కూడా తీసుకోవచ్చు. పర్సనల్ లోన్ల కంటే దీనిపై వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. గతంలో లాగా పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇప్పుడు లేదు. IPPB లేదా DakPay వంటి యాప్స్ ద్వారా మీరు ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. మీ మెయిన్ బ్యాంక్ అకౌంట్‌ను లింక్ చేసుకుంటే చాలు, సెకన్లలో మీ పొదుపు ప్రక్రియ పూర్తవుతుంది. పిల్లల చదువులు లేదా రిటైర్మెంట్ ప్లాన్ కోసం ఇది బెస్ట్ ఆప్షన్.

Tags

Next Story