Post Office : ప్రతి నెలా రూ.5,000 కడితే చాలు..రిస్క్ లేకుండానే 10 ఏళ్లలో రూ.8.5 లక్షలు..ఇది బ్యాంక్ FD కంటే బెస్ట్.

Post Office : ప్రతి నెలా రూ.5,000 కడితే చాలు..రిస్క్ లేకుండానే 10 ఏళ్లలో రూ.8.5 లక్షలు..ఇది బ్యాంక్ FD కంటే బెస్ట్.
X

Post Office : ప్రతి ఒక్కరూ తమ డబ్బు సురక్షితంగా ఉండాలని అదే సమయంలో క్రమంగా పెరిగి మంచి ఫండ్‌గా మారాలని కోరుకుంటారు. స్టాక్ మార్కెట్ లేదా రిస్క్ ఉన్న పెట్టుబడులు అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారి కోసం భారత ప్రభుత్వం నడిపే పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ (రికరింగ్ డిపాజిట్) స్కీమ్ చాలా సురక్షితమైన ఆప్షన్ గా నిలుస్తోంది. ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ఇందులో పెట్టిన డబ్బు మునిగిపోయే ప్రమాదం అస్సలు ఉండదు. రిస్క్ తీసుకోకుండా దీర్ఘకాలంలో మంచి ఫండ్ సృష్టించాలనుకునే వారికి ఈ పథకం చాలా బాగా ఉపయోగపడుతుంది.

పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ పథకం అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే.. దీనికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం లేదు. మీరు ప్రతి నెలా కేవలం రూ.5,000 తో పెట్టుబడిని ప్రారంభించవచ్చు. చిన్న మొత్తంలో క్రమం తప్పకుండా చేసే ఈ పెట్టుబడి, సమయంతో పాటు ఎలాంటి ఆందోళన లేకుండా పెద్ద మొత్తంగా మారుతుంది. ఈ పథకంలో ప్రస్తుతం సంవత్సరానికి 6.7 శాతం వడ్డీ లభిస్తోంది. ఇది చాలా బ్యాంకులు అందించే ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేటు కంటే కూడా ఎక్కువ. ముఖ్యంగా, వడ్డీని త్రైమాసిక ప్రాతిపదికన లెక్కిస్తారు. దీనివల్ల మీ డబ్బుపై కాంపౌండింగ్ (చక్రవడ్డీ) ప్రయోజనం లభిస్తుంది.. ఫలితంగా మీ రాబడి మరింత వేగంగా పెరుగుతుంది.

సాధారణంగా ఆర్‌డీ పథకం మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. అయితే, మీరు 5 సంవత్సరాల మెచ్యూరిటీ తర్వాత ఈ ఆర్‌డీని మరో 5 సంవత్సరాల పాటు అంటే మొత్తం 10 సంవత్సరాల పాటు పొడిగించినట్లయితే అద్భుతమైన ప్రయోజనం పొందవచ్చు.

మీరు 10 సంవత్సరాలలో (నెలకు రూ.5,000 చొప్పున) చేసిన మొత్తం పెట్టుబడి రూ.6,00,000 అవుతుంది. 10 సంవత్సరాల తర్వాత కేవలం వడ్డీ రూపంలో వచ్చే మొత్తం రూ.2,54,481 (సుమారు రూ.2.54 లక్షలు) వస్తాయి. 10 సంవత్సరాల తర్వాత మీకు లభించే మొత్తం ఫండ్ రూ.8,54,481. ఈ పోస్టాఫీసు ఆర్డీ పథకం జీతం తీసుకునేవారు లేదా క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే వారికి సురక్షితమైన పెట్టుబడి పెట్టడానికి అద్భుతమైన మార్గం. దీని ద్వారా పిల్లల చదువులు, వివాహం లేదా రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ఎలాంటి రిస్క్ లేకుండా మంచి ఫండ్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు.

Tags

Next Story