Post Office RD Scheme: నెలకు రూ.10,000 పొదుపుతో 5 ఏళ్లలో రూ.7.11 లక్షలు మీ సొంతం.

Post Office RD Scheme: మ్యూచువల్ ఫండ్స్‌లోని సిప్ లేదా బ్యాంకుల్లోని రికరింగ్ డిపాజిట్ల మాదిరిగానే, పోస్టాఫీస్ కూడా నెలవారీ పొదుపు కోసం ఒక అద్భుతమైన పథకాన్ని అందిస్తోంది. అదే పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్. దీనిని అధికారికంగా నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్ అని అంటారు. ఈ పథకం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మద్దతుతో నడుస్తోంది కాబట్టి, మీ పెట్టుబడికి పూర్తి ప్రభుత్వ హామీ ఉంటుంది. ఈ పథకంలో ప్రతి నెలా రూ.10,000 పెట్టుబడి పెడితే ఎంత రాబడి వస్తుంది? ఇతర ముఖ్య వివరాలు ఏంటో తెలుసుకుందాం.
పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అనేది తక్కువ మొత్తంతో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఒక మంచి పొదుపు మార్గం. ప్రస్తుతం ఈ పథకంలో సంవత్సరానికి 6.7% వడ్డీ రేటు లభిస్తోంది. ఈ పథకం మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. ఇందులో కనీసం నెలకు రూ.100తో కూడా పెట్టుబడి ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టడానికి పరిమితి లేదు. ఇక్కడ వడ్డీని ప్రతి మూడు నెలలకు (త్రైమాసికానికి) చక్రవడ్డీ పద్ధతిలో లెక్కిస్తారు. 5 సంవత్సరాల మెచ్యూరిటీ తర్వాత కూడా అవసరమైతే ఈ పథకాన్ని మరో 5 సంవత్సరాల పాటు పొడిగించుకునే అవకాశం ఉంది.
మీరు ప్రతి నెలా రూ.10,000 చొప్పున 5 సంవత్సరాల పాటు ఈ ఆర్డీ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే ఎంత రాబడి వస్తుందో ఒక అంచనా ఇక్కడ ఉంది. 5 సంవత్సరాలలో మీరు జమ చేసే మొత్తం రూ.6,00,000 అవుతుంది. దీనికి అదనంగా వడ్డీ రూపంలో దాదాపు రూ.1,11,468 జమ అవుతుంది. అంటే మెచ్యూరిటీ తర్వాత మీకు మొత్తం రూ.7,11,468 (సుమారుగా) లభిస్తుంది. కేవలం రూ.6 లక్షల పెట్టుబడికి అదనంగా రూ.1 లక్షకు పైగా వడ్డీ రావడం మంచి విషయం. ఒకవేళ మీ లక్ష్యం 5 సంవత్సరాలలో ఏకంగా రూ.10 లక్షల మెచ్యూరిటీ మొత్తాన్ని పొందడం అయితే, మీరు ప్రతి నెలా దాదాపు రూ.14,500 చొప్పున ఈ పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
అయితే ఈ స్కీమ్‌లో చేరే ముందు ఒక ముఖ్య విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. బ్యాంక్ ఆర్డీలలో ఉన్నట్లుగా ఇందులో ఆన్‌లైన్ పేమెంట్ సిస్టమ్ ఇందులో అందుబాటులో ఉండకపోవచ్చు. అంటే ప్రతి నెలా మీరు స్వయంగా పోస్టాఫీస్‌కు వెళ్లి డబ్బులు చెల్లించాల్సి రావచ్చు. ఈ చిన్న ఇబ్బందిని తప్పించుకోవాలంటే మీరు దగ్గరలోని పోస్టాఫీసులో అడిగి ఆన్‌లైన్ పేమెంట్ సౌకర్యం ఉందో లేదో తెలుసుకోవడం మంచిది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

