Bihar Politics : నితీశ్ అలసిపోయారు.. మానసికంగా రిటైరైపోయారు: ప్రశాంత్ కిశోర్ విమర్శలు

బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై జనసూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ తాజాగా విమర్శలు గుప్పించారు. ‘ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓ విచిత్రం జరగనుంది. ఎన్డీయే గెలిచినా సరే నితీశ్ మాత్రం ఇక బిహార్ సీఎంగా కొనసాగరు. ఆయన పరిస్థితి బాలేదు. శారీరకంగా అలసి, మానసికంగా రిటైరైపోయారు. కనీసం తన మంత్రుల పేర్లు చెప్పే పరిస్థితిలో కూడా లేరు. బిహార్‌లో ఆయన ఇప్పుడు బీజేపీకి ఒక ముసుగు మాత్రమే’ అని పేర్కొన్నారు. నితీశ్ కుమార్ సీఎం కాబట్టి అక్కడి వ్యవస్థలు ఆయను ఎలాగొలా ప్రజల ముందుకు తీసుకొస్తున్నాయని అన్నారు. భారీ స్థాయిలో రాజకీయ శ్రమ చేసే స్థితిలో ఆయన లేరని అన్నారు.
అయితే, బీహార్ రాజకీయాలను తనంతట తానుగా శాసించే స్థితిలో ప్రస్తుతం బీజేపీ లేదని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. ‘‘లోక్‌సభ ఎన్నికల తరువాత 5 సార్లు ఉపఎన్నికలు జరిగాయి. ఎన్డీయే నాలుగింటిల్లో ఓడిపోయింది. బీహార్‌లో ఎన్డీయే ఓటరైనా, ఆర్జేడీ ఓటరైనా ముగ్గురిలో ఇద్దరు మార్పు కోరుకుంటున్నారు’’ అని ఆయన అన్నారు. బీజేపీ హర్యానా, మహారాష్ట్రలో గెలిచినా బీహార్‌లో మాత్రం అంత ప్రభావవంతమైనది కాదన్నారు. బీహార్ అంటే ఢిల్లీలో హర్యానాలో కాదని వ్యాఖ్యానించారు. బీహార్ రాజకీయాలు, సమస్యలు వేరని అన్నారు. అక్కడ బీజేపీ బలం కూడా భిన్నమైనదని చెప్పుకొచ్చారు. కేవలం ఒక్కసారి మాత్రమే బీజేపీ బీహార్‌లో 150 సీట్లల్లో పోటీ చేసిందని గుర్తు చేశారు. సాధారణ 100 సీట్లలోపే తన పోటీ చేస్తుందని చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com