పెండింగ్ కేసులు పెరిగిపోవడం అతిపెద్ద సవాల్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

పెండింగ్ కేసులు పెరిగిపోవడం అతిపెద్ద సవాల్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
X

బాధితులకు న్యాయం తొందరగా అందించాలంటే వాయిదాల పద్ధతి మారాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పెండింగ్ కేసులు భారీ స్థాయిలో పెరిగిపోవడం అతిపెద్ద సవాల్‌ అన్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ సెమినార్ కు రాష్ట్రపతి హాజరై ప్రసంగించారు.న్యాయాన్ని రక్షించాల్సిన బాధ్యత దేశంలోని జడ్జిలందరిపై ఉందన్నారు.‘కొన్ని సందర్భాల్లో పలుకుబడి ఉన్న వ్యక్తులు నేరం చేసిన తర్వాత నిర్భయంగా, స్వేచ్ఛగా తిరుగుతుండటం బాధాకరం. ఆ నేరాల్లో బాధితులు మాత్రం తామే నేరం చేసినట్లు భయంతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. మరోవైపు.. కోర్టులకు హాజరు కావడమనేది సామాన్యులపై ఒత్తిడి పెంచుతుంది. కోర్టుల్లో వాయిదాల పద్ధతిని మార్చేందుకు అన్ని విధాలా కృషి చేయాలి. న్యాయాన్ని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది’అని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. న్యాయవ్యవస్థలో మహిళా అధికారుల సంఖ్య పెరగడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు.

Tags

Next Story