Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఫిజీ అత్యున్నత పౌర పురస్కారం

ఫిజీ పర్యటనలో ముర్ముకు విశిష్ట గౌరవం

ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘కంపానియన్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ఫిజీ’ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు రతు విలియమ్‌ మైవలిలీ కటోనివేర్‌ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ప్రస్తుతం ఫిజీ దేశ పర్యటనలో ఉన్న ఆమె ఈ అవార్డుని అందుకున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం అధికారిక ఎక్స్‌లో పేర్కొంది.

ఫిజీ పార్లమెంటును ఉద్దేశించి ముర్ము మాట్లాడుతూ.. ఫిజీని బలమైన. సంపన్నమైన దేశంగా మార్చేందుకు భారత్‌ అండగా నిలుస్తుందన్నారు. దీంతో రెండు దేశాల ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. దాదాపు 10 ఏళ్ల క్రితం ఫిజీ పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలను గుర్తుచేశారు. ద్వీపదేశమైన ఫిజీలో భారతదేశ రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి. ఫిజీ అధ్యక్షుడు రటు విలియమే మైవాలిలి కటోనివెరేలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పురస్కారంతో భారత రాష్ట్రపతిని గౌరవించారు. దీనిపట్ల ద్రౌపది ముర్ము ఫిజీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.ఇరుదేశాల మధ్య ఉన్న సంబంధాలను ముర్ము ఈ సందర్భంగా ప్రస్తుతించారు. ఫిజీని దృఢమైన, స్థితిస్థాపక, సుసంపన్న దేశంగా మలిచే దిశగా భారత్ భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు సంసిద్ధంగా ఉందని ముర్ము స్పష్టం చేశారు.

అంతకుముందు గత ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభించిన భారతీయ సోలరైజేషన్‌ ఆఫ్ హెడ్స్‌ ఆఫ్‌ స్టేట్‌ రెసిడెన్స్‌ ప్రాజెక్టు పురోగతిని మర్ము పరిశీలించారని రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. ముర్ము ఫిజీ పర్యటన అనంతరం న్యూజిల్యాండ్‌, తిమోర్‌- లెస్ట్‌లలో పర్యటించనున్నారు.

Tags

Next Story