Manipur : మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు

Manipur : మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపు
X

మణిపూర్ లో రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఆగస్టు 13, 2025 నుండి అమల్లోకి వచ్చేలా మరో ఆరు నెలలు పొడిగించారు. దీంతో 2026 ఫిబ్రవరి 13 వరకు మణిపూర్ లో రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. మణిపూర్ లో నెలకొన్న తీవ్ర రాజకీయ సంక్షోభం, జాతుల మధ్య హింసాత్మక ఘర్షణలు, శాంతిభద్రతల సమస్యలు, పరిపాలనా యంత్రాంగం విచ్ఛిన్నం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2025 ఫిబ్రవరి 13న అప్పటి ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రంలో అక్రమ ఆయుధాల స్వాధీనం, సాయుధ గ్రూపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అంతర్గతంగా స్థానభ్రంశం చెందిన ప్రజలను తిరిగి వారి నివాసాలకు చేర్చడంపై కూడా కేంద్రం దృష్టి సారించింది. రాష్ట్ర శాసనసభ కాలపరిమితి 2027 వరకు ఉన్నప్పటికీ, ప్రస్తుతం అది నిలిపివేయబడింది.

Tags

Next Story