PM Modi : ప్రసంగంలో తన రికార్డును తానే బ్రేక్ చేసిన ప్రధాని

PM Modi : ప్రసంగంలో తన రికార్డును తానే బ్రేక్ చేసిన ప్రధాని
X

స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాల నిడివిలో ప్రధాని మోదీ తన రికార్డును తానే బద్దలుకొట్టారు. 2016లో 96 నిమిషాల పాటు ప్రసంగించగా నేడు 98 నిమిషాలతో దాన్ని దాటేశారు. ప్రధానిగా ఆయన స్పీచ్‌ల సగటు 82 నిమిషాలుగా ఉంది. మరే ప్రధానికి ఈ సగటు లేదు. అత్యల్పంగా 2017లో 56 నిమిషాల పాటు మాట్లాడారు. గత ఏడాది 90 మినిట్స్ ప్రసంగించారు. ఇక మరోవైపు ఎర్రకోటపై ప్రధాని మోదీ వరుసగా 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. దీంతో ఎర్రకోటపై ఎక్కువ సార్లు జాతీయ జెండాను ఎగురవేసిన మూడో ప్రధానిగా రికార్డు సృష్టించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత 11 సార్లు జెండా ఎగురవేసిన ప్రధానిగా మోడీ నిలిచారు. కాగా వరుసగా 11 ఏళ్లు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా ఇప్పటికే మోడీ నిలిచారు.మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను రికార్డును మోదీ బద్దలుకొట్టారు. మన్మోహన్ సింగ్ 2004 నుండి 2014 మధ్య ఎర్రకోట ప్రాకారాల నుండి 10 సార్లు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ విషయంలో మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత మోదీ మూడో స్థానానికి చేరుకున్నారు. నెహ్రూ 17 సార్లు, ఇందిర 16 సార్లు ఈ గౌరవాన్ని అందుకున్నారు.

Tags

Next Story