Prime Minister Modi : ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ.258కోట్లు

Prime Minister Modi : ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ.258కోట్లు
X

ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చును కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే ప్రధాని పర్యటనల ఖర్చును తెలపాలని కోరగా విదేశాంగ శాఖ బదులిచ్చింది. 2022 మే నుంచి 2024 డిసెంబర్ వరకూ ప్రధాని 38 విదేశీ పర్యటనలకు చేయగా రూ. 258కోట్లు ఖర్చయినట్లు తెలిపింది. 2023 జూన్‌లో జరిగిన అమెరికా పర్యటనకు అధికంగా రూ.22కోట్లు ఖర్చు జరిగినట్లు తెలిపింది.కాగా, 2022 నుంచి 2024 మధ్య ప్రధాని మోదీ సందర్శించిన విదేశీ దేశాల జాబితాలో అమెరికా, జ‌పాన్‌, జర్మనీ, కువైట్, డెన్మార్క్, ఫ్రాన్స్, యూఏఈ, ఉజ్బెకిస్థాన్, ఇండోనేషియా, ఆస్ట్రేలియా, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా, గ్రీస్, పోలాండ్, ఉక్రెయిన్, రష్యా, ఇటలీ, బ్రెజిల్, గయానా ఉన్నాయి.

Tags

Next Story