PM Modi : మన్మోహన్‌కు ప్రధాని మోడీ నివాళి.. అంత్యక్రియలు ఎప్పుడు, ఎక్కడంటే?

భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణ వేత్త మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో నివాళులు అర్పించారు. మన్మోహన్ కుటుంబసభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ఇతరులు మన్మోహన్ నివాసానికి చేరుకున్నారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించబోతున్నారు. మృతికి సంతాప సూచికంగా 7 రోజులు సంతాప దినాలను పాటిస్తున్నారు. మన్మోహన్ పార్థివదేహాన్ని ఆయన నివాసంలో ప్రజలు, నేతలు సందర్శించారు. భౌతికకాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చిన తర్వాత.. అక్కడ ప్రధాన నేతలు, కాంగ్రెస్ కేడర్ సంతాపం తెలుపుతారు. శనివారం రేపు రాజ్‌ఘాట్ సమీపంలో మన్మోహన్ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com