PM Modi : ట్రంప్ కామెంట్స్‌పై స్పందించిన ప్రధాని మోదీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తనను ప్రశంసించడంపై ప్రధాని మోదీ స్పందించారు. ట్రంప్ సానుకూల వైఖరిని అభినందిస్తూ, మోదీ తన ఎక్స్ పోస్ట్ చేశారు. "ఇరు దేశాల సంబంధాలపై అధ్యక్షుడు ట్రంప్ భావాలు, సానుకూల దృక్పథాన్ని అభినందిస్తున్నాను. భారత్, అమెరికా మంచి భవిష్యత్తు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి" అని మోదీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలు
మోదీ పోస్ట్‌కు కొన్ని గంటల ముందు, ట్రంప్ భారత్‌తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. "భారత్, అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉంది. దీనిపై ఆందోళన ఏమీ లేదు. రెండు దేశాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే విభేదిస్తాయి. నేను ఎప్పుడూ ప్రధాని మోదీతో స్నేహంగా ఉంటాను. ఆయన గొప్ప ప్రధాన మంత్రి. కానీ ఈ సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చలేదు" అని ట్రంప్ అన్నారు. రష్యా నుంచి భారత్ భారీగా చమురు కొనుగోలు చేయడం తనను నిరాశకు గురి చేసిందని గతంలో ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్‌ను నిలువరించడానికి టారిఫ్‌లను కూడా విధించినట్లు ఆయన వెల్లడించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com