PM Narendra Modi : మాల్దీవులు చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవులు చేరుకున్నారు. జూలై 25, 2025న రెండు రోజుల పర్యటన నిమిత్తం మాల్దీవులకు విచ్చేశారు. ఆయనకు మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు స్వాగతం పలికారు. రెండ్రోజులపాటు మాల్దీవుల్లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటించనున్నారు. మాల్దీవుల 60వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రధాన అతిథిగా ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ వేడుకలు జూలై 26, 2025న జరగనున్నాయి. ఇది ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 60 ఏళ్లు నిండిన సందర్భంగా కూడా జరగనుంది. మొహమ్మద్ ముయిజ్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్-మాల్దీవుల సంబంధాలు కొంతవరకు ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో, ప్రధాని మోదీ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించడానికి ఒక కీలకమైన చర్యగా భావిస్తున్నారు. మొహమ్మద్ ముయిజ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మాల్దీవులకు ఒక దేశాధినేత లేదా ప్రభుత్వ అధినేత హాజరుకావడం ఇదే మొదటిసారి. ప్రధాని మోదీ తన యూకే పర్యటనను విజయవంతంగా ముగించుకుని మాల్దీవులకు చేరుకున్నారు. యూకేలో భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరింది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు, హిందూ మహాసముద్ర ప్రాంతంలో స్థిరత్వం, సహకారాన్ని ప్రోత్సహిస్తుందని భావిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com