PM Modi : శాంతి కోసం..! యుక్రెయిన్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ

PM Modi : శాంతి కోసం..! యుక్రెయిన్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ
X

ప్రధాని నరేంద్ర మోడీ ( Narendra Modi ) త్వరలోనే యుక్రెయిన్ పర్యటనకు వెళ్తున్నారు. ఆగస్టు 23వ తేదీన ప్రధాని మోడీ యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశం కానున్నారు. రష్యా, యుక్రెయిన్ మధ్య గత రెండేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ యుక్రెయిన్ వెళ్లడం ఆసక్తికరంగా మారింది.

గత నెలలో ఇటలీలో జరిగిన జీ7 సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీ, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కలిశారు. యుక్రెయిన్ తాజా పరిస్థితులపై చర్చించారు. మోదీ ఇటీవల రష్యాలో రెండు రోజుల పాటు పర్యటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు యుక్రెయిన్ కు వెళ్తుండటంతో ఈ పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

రష్యాలో పర్యటించిన మోడీకి ఆ దేశ అత్యున్నత పౌరపురస్కారాన్ని అధ్యక్షుడు పుతిన్ అందజేశారు. పుతిన్ ఆహ్వానంతో రష్యాకు వెళ్లివచ్చిన మోడీ..ఇప్పుడు యుక్రెయిన్ వెళ్తుండటం ఆసక్తికరంగా మారింది. రష్యా, యుక్రెయిన్ మధ్య సయోధ్యకు ప్రయత్నించాలని భారత్ కు అమెరికా విన్నవించడంతో ప్రధాని రంగంలోకి దిగారా అన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పుతిన్ ఏం చెప్పారు.. మోడీ జెలెన్ స్కీతో ఏం చర్చించబోతున్నారు.. రెండు దేశాల మధ్య శాంతికి తనవంతు ప్రయత్నాలు మోడీ చేస్తున్నారా.. అనేది తేలాల్సి ఉంది.

Tags

Next Story