Priyanka Gandhi : జమిలి జేపీసీలో చోటు దక్కింది ఎవరికో తెలుసా? ప్రియాంక రోల్ ఏంటంటే?

జమిలి ఎన్నికలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటైంది. బీజేపీ ఎంపీ పీపీ చౌదరి పార్లమెంటరీ ప్యానలకు నాయకత్వం వహిస్తారు. మొత్తం 31 మంది సభ్యులున్నారు. వీరిలో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ, బీజేపీ నుంచి పీపీ చౌదరి, అనురాగ్ ఠాకూర్ తదితరు లకు కమిటీలో స్థానం దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎం రమేశ్, బాలశౌరి, హరీశ్ బాలయోగి ఉన్నారు. వచ్చే పార్ల మెంట్ సమావేశాల చివరి వారంలో కమిటీ రిపోర్టును సమర్పిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. లోక్సభ నుంచి జేపీసీకి బాధ్యత వహించే వారిపేర్లను బుధవారం సాయంత్రం ప్రకటించారు. వీరిలో గాంధీ, పీపీ చౌదరి, సీఎం రమేశ్, బాన్సురి స్వరాజ్, రూపా అనురాగ్ ఠాకూర్, విష్ణుదయాల్, భర్తృ హరి మెహతాబ్, సంతిబ్ పాత్ర, అనిల్ బలూని, విష్ణుదత్త శర్మ, మనీశ్ తివారి, సుఖ్ దేవ్ భగత్, ధర్మేంద్ర యాదవ్, కల్యాణ్ బెనర్జీ, టీఎం సెల్వగణ పతి, హరీశ్ బాలయోగి, సుప్రియా సూలే, శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే, చందన్ చౌహాన్, బాలశౌరి ఉన్నారు. రాజ్యసభ నుంచి ఎంపికయ్యే పది మంది పేర్లను ప్రకటించాల్సివుంది. వీరి జాబితా ఖరారైన తర్వాత కమిటీ చైర్మన్ ను ప్రకటిస్తారు. విపక్షాల ఆందోళన మధ్య లోక్సభ, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే రెండు బిల్లులను కేంద్రం మంగళవారం లోక్ సభలో ప్రవేశ పెట్టింది. పూర్తి స్థాయిలో చర్చ జరిగేందుకు వీలుగా ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com