Priyanka Gandhi : వయనాడ్ లో అన్న రాహుల్ తో కలిసి ప్రియాంక సందడి

వయనాడ్ బరిలో దిగిన ప్రియాంక గాంధీ.. రాహుల్ గాంధీతో కలిసి బస్సులో సందడి చేశారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. కేరళలోని వాయనాడ్ పార్లమెంట్ స్థానానికి ఆమె నామినేషన్ వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో రాయబరేలీ, వాయనాడు నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్ నిబంధనల ప్రకారం ఒక స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దాంతో ఆయన వాయనాడ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో ప్రియాంక పోటీకి దిగుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆమె తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ, భర్త రాబర్ట్ వాద్రా , కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు జరిగిన రోడ్ షోలో ప్రియాంక కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇంతవరకు తన తల్లి, సోదరుడికి కోసం ప్రచారం చేశాననీ..తొలి సారి తన కోసం ప్రచారం చేసుకుంటున్నానన్నారు. తనకు అవకాశం కల్పిస్తే వాయనాడు ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com