Priyanka Gandhi : ప్రియాంక గాంధీ ఆస్తులు ఇవే
X
By - Manikanta |24 Oct 2024 3:30 PM IST
కేరళ రాష్ట్రం వాయనాడ్ లోక్ సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంక గాంధీ తన పేరు మీద ఉన్న ఆస్తులకు సంబంధించి అఫిడవిట్ సమర్పించారు. తనకు తన భర్త రాబర్ట్ వాద్రాకు కలిపి 42 కోట్ల చరాస్తులు, 35 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్‌తో పాటే వయనాడ్ ఉపఎన్నికకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. వయనాడ్ లోక్‌సభ స్థానానికి నవంబర్ 20వ తేదీన పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 23వ తేదీన ఓట్లను లెక్కించి విజేతను ప్రకటించనున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com