Priyanka Gandhi : నేడు ఎంపీగా ప్రియాంక ప్రమాణస్వీకారం

Priyanka Gandhi : నేడు ఎంపీగా ప్రియాంక ప్రమాణస్వీకారం
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ నేడు పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు. వయనాడ్ ఉపఎన్నికలో గెలిచిన ఆమె నేడు ఎంపీగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తల్లి సోనియా రాజ్యసభ ఎంపీగా ఉండగా సోదరుడు రాహుల్ లోక్‌సభ ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన వయనాడ్ ఉపఎన్నికలో రికార్డు స్థాయిలో 4,10,931 ఓట్ల మెజారిటీతో గెలిచి ప్రియాంక చరిత్ర సృష్టించారు.

ఇక, 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే రాహుల్.. రాయ్‌బరేలీ స్థానాన్ని ఉంచుకుని.. వయనాడ్ స్థానానికి రాజీనామా చేశాడు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక, ఆ స్థానం నుంచి రంగంలోకి దిగిన ప్రియాంక గాంధీ ఘన విజయాన్ని దక్కించుకున్నారు. అలాగే, వయనాడ్‌లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నవ్య హరిదాస్‌ మూడో స్థానంలో ఉండిపోయారు.

అయితే, ప్రియాంక గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం మాత్రమే చేసింది. పార్టీ గెలుపు కోసం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించింది. కానీ, తొలిసారి వయనాడ్ బైపోల్‌లో బరిలోకి దిగి విజయం సాధించారు. ఇక ఈరోజు పార్లమెంట్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. పార్లమెంట్ మెంబర్‌గా ప్రియాంక ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Tags

Next Story