PM Modi : గర్వకారణమైన క్షణం: క్యాబినెట్ సహచరులతో ప్రధాని మోదీ!

PM Modi : గర్వకారణమైన క్షణం: క్యాబినెట్ సహచరులతో ప్రధాని మోదీ!
X

పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె) అంతటా ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ చేపట్టచిన ఆపరేషన్ సిందూర్ అందరికీ గర్వకారణమైన క్షణం అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం తన మంత్రివర్గ సమావేశంలో తన సహచరులతో అన్నారు. తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన దాడులు చేసి, లక్ష్యాలను తక్కువ సమయంలోనే చేధించినందుకు సాయుధ దళాలను ప్రధాని మోదీ అభినందించారని వర్గాలు తెలిపాయి. ఇది కొత్త భారతదేశం అని ప్రధానమంత్రి తన మంత్రులతో చెప్పారని వారు అన్నారు. కేవలం 25 నిమిషాల పాటు వేగంగా మరియు సమన్వయంతో కూడిన మెరుపు దాడిలో నిషేధిత సంస్థలైన జైషే మొహమ్మద్ (జెఎం), లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) మరియు హిజ్బుల్ ముజాహిదీన్‌లతో సంబంధం ఉన్న 80 మందికి పైగా ఉగ్రవాదులు ఖచ్చితమైన దాడుల్లో మరణించారని ఉన్నత వర్గాలు తెలిపాయి. భారత్ జరిపిన క్షిపణి దాడుల్లో 26 మంది పౌరులు మరణించారని, 46 మంది గాయపడ్డారని ఇస్లామాబాద్ తెలిపింది.

Tags

Next Story