Pune Airport Rename : పుణె ఎయిర్‌పోర్టు పేరు మార్పు .. మహారాష్ట్ర క్యాబినెట్ ఆమోదం

X
By - Manikanta |24 Sept 2024 1:45 PM IST
మహారాష్ట్రలోని పుణె ఎయిర్ పోర్టు పేరు మార్పునకు రంగం సిద్ధమైంది. ఈ ఎయిర్‌పోర్టు పేరును జగద్గురు తుకారామ్ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేసే ప్రతిపాదనకు మహారాష్ట్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రతిపాదనను కేంద్రం ఆమోదం కోసం పంపనున్నట్లు అధికారులు వెల్లడించారు. పుణెకు చెందిన కేంద్ర పౌర విమానయానశాఖ సహాయమంత్రి మురళీధర్ మహోల్ ఈ ప్రతిపాదన చేయగా.. శిందే సారథ్యంలోని మహా ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రమంత్రి కృతజ్ఞతలు తెలుపుతూ ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. తాను ప్రతిపాదించిన అంశానికి ఆమోద ముద్ర వేసినందుకు ఆనందంగా ఉందని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com