నా లైఫ్ నా ఇష్టం...ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు : రాధికా గుప్తా

కార్లను తరిగిపోయే ఆస్తిగా తాను భావిస్తానని ఎడెల్ వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈవో, ఎండీ రాధికా గుప్తా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఇన్వెస్ట్ మెంట్స్ పై సజెషన్స్ అందించే రాధికా గుప్తా.. తాను లగ్జరీ కారు కొనకపోవడానికి కారణాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ‘లగ్జరీ కారు కొనే కెపాసిటీ నాకు ఉంది. బోనస్ వచ్చిన ప్రతిసారీ ఫ్యాన్సీ కారు కొనాలని అనుకుంటా. అయితే, కారు అనేది విలువ తరిగిపోయే ఆస్తి. ఒకవేళ దాన్ని అమ్మాలనుకుంటే ఆ విలువ 30 శాతం తగ్గిపోతుంది’ అని రాధికా గుప్తా తెలిపారు. ‘18 ఏళ్ల క్రితం కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకొని బయటకు వచ్చా. ఆ టైమ్ లో చాలా మంది నా వద్దకు వచ్చి నీ దగ్గర కనీసం ఫ్యాన్సీ బ్యాగ్ లేదా? అని అడిగేవారు. ఆ సమయంలో చాలా బాధేసింది. ఏమీ మాట్లాడలేకపోయేదానిని. కానీ ఇప్పుడు ఎవరైనా వచ్చి ఎందుకు ఇన్నోవా నడుపుతున్నావు? అని అడిగితే కచ్చితంగా ఆన్సర్ ఇస్తా. నా లైఫ్.. నా ఇష్టం. ఎందుకంటే ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు’ అని రాధికా అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com