Rahul Gandhi : ఉపాధి రంగాన్ని మోదీ అంతం చేశారు : ఎంపీ రాహుల్ గాంధీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ఉపాధి వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోడీ ఒక క్రమపద్దతిలో అంతం చేశారని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. హర్యానాలోని అసాంద్‌లో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. బీజేపీ ప్రభుత్వం హర్యానాను నాశనం చేసిందని విమర్శించారు. ఇటీవల యూఎస్ పర్యటనకు వెళ్లినప్పుడు హర్యానా నుంచి వెళ్లిన కొంతమంది వలసదారులను అక్కడ కలిశానని, వారు తమ సొంత రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేనందునే అక్కడికి వెళ్లినట్టు చెప్పారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ. 2,000, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామన్నారు. హర్యానాలో రెండు లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని, కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని దీమా వ్యక్తం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com