Rahul Gandhi : కుంభమేళాలో తొక్కిసలాట.. యూపీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు

Rahul Gandhi : కుంభమేళాలో తొక్కిసలాట.. యూపీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు
X

మహా కుంభమేళా తొక్కిసలాట కలచివేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నిర్వహణ లోపం, సామాన్య భక్తులను వదిలేసి వీఐపీలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోనే ఈ ఘటన జరిగిందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పటికైనా మేల్కోవాలని హితవు పలికారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ శ్రేణులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

నిన్న 5 కోట్లు, నేటి ఉదయం 8గం.కే 4 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారని యోగి తెలిపారు. మౌని అమావాస్య రోజు త్రివేణీ సంగమం వద్ద స్నానం చేయడం పుణ్యప్రదం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారని పేర్కొన్నారు. వృద్ధులు, పిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గంగా ఘాట్లలో స్నానాలు చేయాలని సూచించారు. తొక్కిసలాటలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయన్నారు. వదంతులను నమ్మవద్దని తెలిపారు.

ప్రయాగ్‌రాజ్‌కు కోట్లాది మంది వస్తుండటంతో రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మహా కుంభమేళా స్పెషల్ ట్రైన్లను ఇండియన్ రైల్వే నిలిపివేసింది. తర్వాతి ఆదేశాలు వచ్చేంత వరకు ఆపేస్తున్నట్టు తెలిపింది. రెగ్యులర్ ట్రైన్లు యథావిధిగా నడుస్తాయని వెల్లడించింది.

Tags

Next Story