Rahul Gandhi : అగ్నివీర్‌పై రాహుల్ రచ్చ.. వివరణకు కేంద్రం రెడీ

అగ్నివీర్ స్కీంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్రాన్ని ఇరుకునపెట్టేందుకు ట్రై చేస్తున్నారు. ఐతే.. కేంద్రం రాహుల్ ఆరోపణలను తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తోంది. అగ్నివీర్ 'చక్రాయుధం' లో యువత చిక్కుకున్నారని, అగ్నివీరుల పెన్షన్ కు బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరపలేదని విపక్ష నేత రాహుల్ గాంధీ లోక్ సభలో చేసిన వ్యాఖ్యలపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ ప్రసంగం ముగిసిన వెంటనే రాజ్ నాథ్ సింగ్ లోక్ సభలో స్పందించారు. అగ్నివీర్ పథకంపై దేశాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. విపక్ష నేత ఎప్పుడు కోరితే అప్పుడు సభ ముందు సమగ్ర ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
"జాతీయ భద్రత అంశా చాలా సున్నితమైనది. అగ్నివీర్ జవాన్లకు సంబంధించి దేశాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్పీకర్ ఎప్పుడు అదేశిస్తే అప్పుడు అగ్నివీర్ సోల్జర్స్ అంశంపై సభలో ప్రకటన చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను" అని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతుండగా మధ్యలో రాహుల్ గాంధీ అమరవీరుల నష్టపరిహారం
అంశాన్ని లేవనెత్తారు. జమ్మూకశ్మీర్ లోని నౌషెరాలో మందు పాతర పేలి గత జనవరిలో మరణించిన అగ్నివీరు ఇన్సూరెన్స్ ఇచ్చారనే కానీ, ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వలేదన్నారు.
దీనికి ముందు, సభలో రాహుల్ మాట్లాడుతూ బడ్జెట్ లో మధ్యతరగతి ప్రజానీకానికి ద్రోహం చేసిందన్నారు. బీజే పీ ప్రభుత్వం ఆధునిక చక్ర వ్యూహాన్ని నిర్మించిందని, అందులో రైతులు, మధ్యతరగతి ప్రజలు, సమాజంలోని ఇతర వర్గాల వారు చిక్కుకు న్నారని అన్నారు. పద్మవ్యూహం కమలాకారంలో ఉంటుందన్నారు. కమలం పార్టీ దేశంలో అధికారంలో ఉందని, రైతులు భయపడుతున్నారని, అన్నారు. కమలం పద్మవ్యూహాన్ని మోదీ, అమిత్, మోహన్ భగవత్, అజిత్ దోవల్, అంబానీ, అదానీ వంటి వారు కంట్రోల్ చేస్తున్నారని అన్నారు. స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేసుకోవడంతో రాహుల్ తిరిగి స్పందిస్తూ..." మీరు కోరితే ఎన్ఎస్ఏ, అంబానీ, అదానీ పేర్లు మినహాయించి, తక్కిన మూడు పేర్లు తీసుకుంటాను” అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com