Rahul Gandhi : గోల్డెన్ టెంపుల్ లో రాహుల్ గాంధీ సందడి

Rahul Gandhi : గోల్డెన్ టెంపుల్ లో రాహుల్ గాంధీ సందడి
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమృత్‌సర్‌ గోల్డెన్‌ టెంపుల్‌ను సందర్శించారు. ఆలయానికి వచ్చిన రాహుల్‌ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తెల్లటి కుర్తా, బ్లూ స్కార్ఫ్‌ ధరించి ఆలయంలో సందడి చేశారు. అంతేకాదు ఆలయంలో సేవలో రాహుల్ పాల్గొన్నారు. ఆలయానికి వచ్చి న భక్తులకు నీటిని అందించారు. స్వర్ణ దేవాలయంలో రాహుల్‌ను చూసి భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. రాహుల్‌తో సెల్ఫీ దిగేందుకు పోటీపడ్డారు. మరోవైపు.. నవంబర్ 20న ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

Tags

Next Story