Weather: కేరళను ముంచెత్తుతున్న వర్షాలు

కేరళను వర్షాలు ముంచెత్తడంతో అక్కడి రోడ్లన్ని జలంమయం అయ్యాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.మీనాచిలార్, మణిమలయార్ జలాశయాల్లో నీటిమట్టం పెరుగుతోంది.వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.కేరళ ప్రభుత్వం మొత్తం 12 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.అలాగే కొల్లం, తిరువనంతపురంలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.రాబోయే 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.ఈ క్రమంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తీర ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com