Heavy Rain : ముంబైని ముంచెత్తిన వాన.. 104 మిల్లీమీటర్ల వర్షాపాతం

ముంబైలో ఇవాళ ఉదయం ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం సాధారణ జనజీవనాన్ని స్తంభింపజేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటు తుఫాను కారణంగా రోడ్లపై వరదనీరు చేరి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. సబ్ అర్బన్ రైళ్లు, విమాన సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. ముంబైలోని నారిమన్ పాయింట్ వద్ద అత్యధికంగా 104 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. అదే విధంగా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద 80మి.మీ. వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు రానున్న 24 గంటల్లో నగరంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుంచి 40కి లోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం కూడా ఉందని తెలిపింది.
ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్
దేశ రాజధాని నగరంల ఢిల్లీలో ఇవాళ తెల్లవా రుజామున తేలికపాటి జల్లులు కురిశాయి. నగరంలో వాతావరణ ఒక్కసారిగా చల్లబడటంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో, చెట్ల కింద, శిథిలావస్థ నిర్మాణాలకు దగ్గరగా ఉం డొద్దని పేర్కొంది. నిన్న ఉదయం కురిసిన భారీ వర్షాలతో ఢిల్లీలో భారీగా వరదనీరు రోడ్లపై చేరింది. ఫలితంగా గోడలకు, మ్యాన్హాళ్లకు దూరంగా ఉండాలని అధికారులను ప్రజలకు సూచించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com